శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (14:48 IST)

పవన్‌పై కుట్రకు సంబంధించి.. నాకు చాలా నిజాలు తెలుసు: మాధవీలత

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం అంతులేని కథగా సాగుతున్న తరుణంలో.. ఈ పోరును మొదలుపెట్టిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడంలో రూటు మారింది. ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని చర్చా కార్యక్రమాలను పెట్టే మీడియా స

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం అంతులేని కథగా సాగుతున్న తరుణంలో.. ఈ పోరును మొదలుపెట్టిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడంలో రూటు మారింది. ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని చర్చా కార్యక్రమాలను పెట్టే మీడియా సంస్థలపై పవన్ ట్వీట్ల ద్వారా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆయా మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తో సహా ఆయన అభిమానులు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా హీరోయిన్ మాధవీలత పవన్‌కు మద్దతు పలికింది. మాధవీలత క్యాస్టింగ్ కౌచ్ పోరాటానికి మద్దతు తెలుపుతూనే పవన్ కళ్యాణ్‌ని అభిమానించే వ్యక్తిగా ఆయనకు అండగా నిలిచింది. కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ని అనవసరంగా లాగారని, పవన్ కుటుంబ సభ్యులను దూషించడంపై మాధవీలత ఖండించింది. 
 
పవన్‌పై కుట్ర జరుగుతుందని.. తనకు చాలా నిజాలు తెలుసునని మాధవీలత చెప్పింది. పవన్‌‌పై జరుగుతున్న కుట్రని నర్మగర్భంగా వివరించింది. తనకు నిజాలు ఎలా తెలుసు?నని మాధవీలత చెప్పుకొచ్చింది.