శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (20:01 IST)

'భరత్ అనే నేను' కథను పవన్ తిరస్కరించారా? కొరటాల శివ ఏమన్నారు?

దర్శకుడు కొరటాల శివ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "భరత్ అనే నేను". మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా తెరక్కిన ఈ చిత్రం ఇటీవలై విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌త

దర్శకుడు కొరటాల శివ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "భరత్ అనే నేను". మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా తెరక్కిన ఈ చిత్రం ఇటీవలై విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కనకవర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో దర్శకుడు కొరటాల శివ ఓ విషయంపై స్పష్టతఇచ్చారు.
 
నిజానికి ఈ సినిమాను ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చేయాల‌నుకున్నాడ‌ని, అయితే ఈ సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆ విష‌యం గురించి కొర‌టాల స్పందించారు. అది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని తేల్చేశారు. 
 
'ఈ సినిమాకు సంబంధించినంతవ‌ర‌కు నేను ప‌వ‌న్‌ను క‌ల‌వ‌నే లేదు. ఈ సినిమాలో ప‌వ‌న్ చేస్తే బాగుంటుంద‌ని కూడా అనుకోలేదు. పూర్తిగా రాజ‌కీయాల‌తో సంబంధంలేని హీరో అయితేనే బాగుంటుంద‌ని అనుకున్నా. మ‌హేష్ అయితే ఫెర్‌ఫెక్ట్ అనిపించింది' అని కొర‌టాల శివ చెప్పుకొచ్చారు.