మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:34 IST)

క్యాస్టింగ్ కౌచ్‌పై బిటౌన్ భామలు ఏమన్నారంటే.. కోరుకున్నప్పుడల్లా తాకడం.. ముద్దు..?

క్యాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్ సినీతారలు ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్‌పై తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన బాలీవుడ్ డార

క్యాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్ సినీతారలు ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్‌పై తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన బాలీవుడ్ డార్క్ సీక్రెట్ అనే డాక్యుమెంటరీలో రాధికా ఆప్టే, ఉషా జాదవ్ వంటి ప్రముఖ హీరోయిన్లు బిటౌన్ చీకటి కోణాల గురించి తెలిపారు. 
 
ఈ క్రమంలో క్యాస్టింగ్ కౌచ్‌పై జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హీరోయిన్ ఉషా జాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌లోనూ అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నానని.. అవకాశం రావాలంటే.. నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని చెప్పారని.. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న అమ్మాయిలందరూ ఈ వ్యవహారంపై ముందుకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం వుందని ఉషా జాదవ్ పేర్కొన్నారు.
 
రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొంత మంది తమకు తామే దేవుళ్లమని భావిస్తారని చెప్పింది. వారికి ఎదురుతిరిగితే.. కెరీర్లు నాశనమైనట్లేనని రాధికా ఆప్టే తెలిపింది. అందరూ కలిసి క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని రాధికా ఆప్టే పేర్కొంది. మరో వర్ధమాన నటి అయితే తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పూసగుచ్చినట్లు చెప్పింది. 
 
ఇండస్ట్రీలో ఛాన్స్ దొరకాలంటే.. వీలు దొరికినప్పుడల్లా శృంగారంలో పాల్గొనేందుకు సిద్ధంగా వుండాలంది. ఓ వ్యక్తి అయితే తాను కోరుకున్నప్పుడల్లా వచ్చి.. తాకడం.. ముద్దుపెట్టడం చేసేవాడని.. అతడి ప్రవర్తన షాక్‌కు గురిచేసిందని చెప్పుకొచ్చింది.