శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 2 మే 2018 (17:27 IST)

హత్య చేయిస్తారా? పవన్ అభిమానులతో కొట్టిస్తారా? శ్రీరెడ్డి ప్రెస్ మీట్(Video)

శ్రీరెడ్డి బుధవారం నాడు ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి సభ్యత్వం కోసం బ్యాంకు చెక్కును అందజేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... " మా తమ్ముడు దుమ్ము దులుపుతాడని అంటారేమిటి? ఏమిటి మీ బెదిరింపులు, మీరేమైనా పోలీసా, లాయరా? 24 క్రాఫ్ట్స్‌లో వున్న సమస్యల కోసం పోర

శ్రీరెడ్డి బుధవారం నాడు ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి సభ్యత్వం కోసం బ్యాంకు చెక్కును అందజేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... " మా తమ్ముడు దుమ్ము దులుపుతాడని అంటారేమిటి? ఏమిటి మీ బెదిరింపులు, మీరేమైనా పోలీసా, లాయరా? 24 క్రాఫ్ట్స్‌లో వున్న సమస్యల కోసం పోరాడేందుకు వచ్చా. పవన్ గారూ... లాని వాడుకోమన్నారు కదా... ఇక చూడండి నా తడాఖా. 
 
యుద్ధం ఎలా వుంటుందో చూస్తారు. తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తయితే మా ఆడవాళ్ల ఉద్యమం ఎలా వుంటుందో రుచి చూపిస్తాం. నాలుగు గోడలు మధ్యన కూర్చుని మా సమస్యలు పట్టవంటే ఒప్పుకోం. కోట్లు కోట్లు గుంజుతున్నారు కదా. అమ్మాయిల దగ్గర డబ్బులు గుంజేసి నాటకాలు ఆడదామనుకుంటున్నారా.
 
కోన వెంకట్ చూసుకుందాం రా.. ఖబడ్దార్. నాని, శేఖర్ కమ్ముల పేర్లు కూడా బయటపెట్టా, వాళ్ల సంగతి కూడా తేలుస్తా. తొక్కుదామని చూస్తే ఎగసిఎగసి పడుతాం. కేసులకు భయపడేది లేదు" అంటూ వెల్లడించింది.