1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (15:30 IST)

అధికారంలోకి వస్తే.. రైతు రుణాలను మాఫీ చేస్తాం: కుమారస్వామి హామీ

కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండిం

కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండించిన పంటలకు కూడా మద్దతు ధర లభించలేదన్నారు. 
 
కంది రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూసినా ఫలితం లేక చివరకు ఈ పంట కొనుగోళ్ల మాఫియాకు బలైనట్లు కుమార స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ద్రాక్ష, నిమ్మ రైతులు రుణాల ఉచ్చులో చిక్కుకున్నారన్నారు. ఇప్పటికే రూ.58 వేల కోట్ల విలువైన పంట నష్టమైందని కుమారస్వామి లెక్కగట్టారు. జాతీయ బ్యాంకులలో చేసిన వేలాది కోట్ల రుణాలు మేము అధికారంలోనికి వచ్చిన తక్షణమే మాఫీ చేస్తామని తెలిపారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుతో ప్రజలు విసిగిపోయారని.. పదేళ్లుగా విసిగి వేసారిన ప్రజలు జేడీఎస్‌ పాలన కోసం వేచి చూస్తున్నారని కుమారస్వామి చెప్పారు. రైతులతో పాటు మహిళలకు తమ పార్టీ అండగా వుంటుందని, స్త్రీ శక్తి సంఘాలకు వడ్డీ రహిత రుణాలతో పాటు ఇప్పటి వరకు చేసిన రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.