శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (14:43 IST)

'అజ్ఞాత‌వాసి'పై భారీ అంచనాలే పెట్టుకుంటే... ప్చ్... అనూ ఇమ్మాన్యుయేల్

టాలీవుడ్‌పై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె నేచురల్ స్టార్ నాని హీరోగా గతంలో వచ్చిన "మజ్ను" చిత్రంతో తెలుగు వెండితెర అరంగేట్రం చేసింది. ఆ త‌ర్వాత ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌

టాలీవుడ్‌పై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె నేచురల్ స్టార్ నాని హీరోగా గతంలో వచ్చిన "మజ్ను" చిత్రంతో తెలుగు వెండితెర అరంగేట్రం చేసింది. ఆ త‌ర్వాత ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో న‌టించే గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసింది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాత‌వాసి' సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మానుయేల్ న‌టించింది. ఆ సినిమా మీద అను ఎంతో ఆశ‌లు పెట్టుకుంది.
 
అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో హీరోతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో అను ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈనేపథ్యంలో అను తాజాగా నటించిన "నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా" చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా 'అజ్ఞాత‌వాసి' సినిమాపై స్పందిస్తూ, 'టాలీవుడ్‌లోకి వ‌చ్చిన కొత్త‌లోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వంటి హీరోతో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం నిజంగా అదృష్టంగా భావించా. దీంతో ఆ చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నా. అయితే, ఆ చిత్రం ప‌రాజ‌యం పాలుకావడం నన్ను తీవ్ర నిరాశకు లోనుచేసింది. దీంతో చాలా బాధ‌ప‌డ్డాను. అయితే ఆ బాధ ఎక్కువ కాలం ఉండలేదనుకోండి. దానికి కార‌ణం 'నా పేరు సూర్య' వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషం వేసిందన్నారు.