సంబంధిత వార్తలు
- హత్య చేయిస్తారా? పవన్ అభిమానులతో కొట్టిస్తారా? శ్రీరెడ్డి ప్రెస్ మీట్(Video)
- జనసేన తరఫున నాగబాబు పోటీ చేస్తారా..?
- పవన్ ప్రకటనతో వామపక్షాల నోట్లో పచ్చివెలక్కాయ్, పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా?
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరం...
- నిజమే... నా పేరు సూర్యపై కుట్ర జరుగుతోంది... హర్ట్ అయ్యాం : మెగాబ్రదర్ నాగబాబు ఇంటర్వ్యూ
నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్‌కి పవన్ కళ్యాణ్ వస్తున్నారా..?
సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం.. చిత్రాలతో వరుస విజయాలు సాధించి టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రంలో రవితేజ, మాళవిక శర్మ జంటగా నటించారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఏమాత్రం
సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం.. చిత్రాలతో వరుస విజయాలు సాధించి టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రంలో రవితేజ, మాళవిక శర్మ జంటగా నటించారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా నిర్మించారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ మూవీని ఈ నెల 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ లోగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. అయితే... ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ విషయంగానీ .. ముఖ్య అతిథి విషయం గాని అధికారికంగా ఖరారు కాలేదని తాజాగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ట్వీట్ చేశాడు.
మరి ఇదే విషయాన్ని అధికారికంగా చెబుతారో.. కొత్త నిర్ణయమేదైనా చెబుతారో చూడాలి. ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. మాస్ టైటిల్‌తో కూడిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందడం విశేషం. మరి.. ఈ మూవీతో కళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.
