సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (09:04 IST)

పవన్‌పై కౌంటర్లు సంధిస్తా.. సెల్ఫీలు దిగేవారంతా ఓట్లేయరు : సాయికుమార్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం చేస్తే ఆయనపై కౌంటర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తెలిపారు. ఇదే అంశ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం చేస్తే ఆయనపై కౌంటర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సినీ తారల ప్రచారానికి ఓట్లు రాలవని వ్యాఖ్యానించారు.
 
ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకే ప్రజలకు ఆసక్తి కనబరుస్తారని అన్నారు. ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోయే అతిపెద్ద మీడియా 'సినిమా'నే అని ఆయన చెప్పారు. సినీ తారలతో రోడ్ షో‌లు నిర్వహించడం వల్ల ఫలితం ఉండదన్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించడంతో పాటు సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకుతో తాను విజయం సాధించడం ఖాయమని సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు.
 
ఈ ఎన్నికల్లో సాయి కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 90 శాతం మంది తెలుగు ప్రజలే నివశిస్తున్నారు. పైగా, ఈ స్థానం అనంతపురం జిల్లాను ఆనుకునివుంది. దీంతో సాయికుమార్ విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.