శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (17:01 IST)

చంద్రబాబుది నాలుక కాదు.. తాటిమట్ట : సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారం విపరీతంగా జరుగుతోందన్నారు.
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం మెలిక పెట్టడంతోనే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం తెరపైకి తెచ్చిందన్నారు. ఈ ప్యాకేజీ ప్రకటించగానే చంద్రబాబు సంతోషంగా అంగీకరించారన్నారు. కానీ, ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. తమ పార్టీకి ఏపీలో గడ్డు పరిస్థితి ఉందని, టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, గడ్డు పరిస్థితులు లేవు, గుడ్‌ పరిస్థితులు ఉన్నాయని సోము వీర్రాజు చమత్కరించారు.
 
న్యాయం బీజేపీ, మోడీల వెనుక ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు.. మోడీని మాట్లాడటం చేతగాని సినీ నటుడు బాలకృష్ణతో తిట్టించారని, బాలయ్యపై ఒక్క కేసు కూడా పెట్టలేదని అన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం తనపై పలు కేసులు పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. చంద్రబాబుది నాలుక కాదని, తాటిమట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.