శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:24 IST)

ఎమ్మెల్యే చింతమనేనిపై 'చండ్ర'నిప్పులు.. ఇష్టంలేకుంటే వెళ్లిపోవచ్చు

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉండటం ఇష్టంలేకుంటే నిర్ద్వంద్వంగా వెళ్లిపోవచ్చంటూ నిర్మొహమ

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉండటం ఇష్టంలేకుంటే నిర్ద్వంద్వంగా వెళ్లిపోవచ్చంటూ నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో చింతమనేని ఖంగుతిన్నారు.
 
గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు కట్టుదాటి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న విషయం తెల్సిందే. అలాంటి వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లో ఒక మంత్రిని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కడిగేశారు. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పారు. 
 
గతంలో మాదిరిగా మృదువుగా నచ్చజెప్పే ధోరణికి స్వస్తిపలికి ఆయన కటువుగా వ్యవహరిస్తుండడంతో నేతలకు గొంతు మింగుడుపడడం లేదు. ఎన్నికలు ఏడాదిలో తొంగిచూస్తుండడం.. కొన్ని నియోజకవర్గాల నేతల్లో మార్పు కనిపించకపోవడం బాబు కఠిన వైఖరికి కారణం. 
 
ముఖ్యంగా, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వ్యవహారం చంద్రబాబుకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎందుకంటే.. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై కూడా ఆయన చేయి చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా బస్సుపై అంటించిన పోస్టర్లో చంద్రబాబు బొమ్మ చిరిగిందన్న కారణంతో ఆర్టీసీ సిబ్బందితో.. అడ్డువచ్చిన వారితో తగాదా పెట్టుకుని అందులో ఒకరిని కొట్టారన్న అభియోగం ఎదుర్కొంటున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను సీఎం చాలా గట్టిగా మందలించినట్లు సమాచారం.
 
గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రభాకర్‌ ఇక్కడకు వచ్చి సీఎంను కలిశారు. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట నాకు ముఖ్యం' అంటూ చంద్రబాబు హెచ్చరించడంతో చింతమనేని ఖంగుతిన్నారు.