శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (15:03 IST)

బీజేపీ ఎమ్మెల్యే నపుంసకుడా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ నపుసంకుడా? తాజాగా ఈ సందేహం ఉత్పన్నమైంది. ఎందుకంటే ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారనే వార్త

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ నపుసంకుడా? తాజాగా ఈ సందేహం ఉత్పన్నమైంది. ఎందుకంటే ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది.
 
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌‌ను అత్యాచార కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా, లైంగిక సామర్ద్య పరీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. సెంగార్‌కు విధించిన 12 రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగియనుండటంతో... శుక్రవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 
 
మరోవైపు, సెంగార్‌కు లై‌డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ ఇప్పటికే న్యాయస్థానానికి దరఖాస్తు చేసినట్టు చెబుతున్నారు. సీబీఐ విచారణ సందర్భంగా ఆయన తరచూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడనీ... వివిధ బృందాలు అడిగిన ఒకే ప్రశ్నకు రకరకాల సమాధానాలు చెబుతున్నాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.