దేవ్ జనసేన వ్యూహకర్తా? బీజేపీ కార్యకర్తా?... పవన్ కళ్యాణ్‌కు ఇది తెలుసా?
జనసేనకు రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ను నియమించడంతో అసలు ఈ దేవ్ ఎవరనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఏర్పడింది. వాసుదేవయ్య అలియాస్ దేవ్ కేరాఫ్ చింతల్ బస్తి అని ప్రచారం జరుగుతోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సర్వేలు చేస్తారని, పాపులర్ శాఫాలజిస్ట్ అని
జనసేనకు రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ను నియమించడంతో అసలు ఈ దేవ్ ఎవరనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఏర్పడింది. వాసుదేవయ్య అలియాస్ దేవ్ కేరాఫ్ చింతల్ బస్తి అని ప్రచారం జరుగుతోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సర్వేలు చేస్తారని, పాపులర్ శాఫాలజిస్ట్ అని జనసేన నాయకులు పరిచయం చేసిన దేవ్, 2014లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజేపీలో చేరి సనత్‌నగర్ ఎమ్యెల్యే టిక్కెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారని అంటున్నారు.
అయితే పొత్తుల్లో భాగంగా సనత్‌నగర్ నుండి తలసాని పోటీ చేయడంతో ఆ సీటు దేవ్‌కు దక్కలేదు. అది కుదరకపోవడంతో మళ్లీ వ్యాపారాల వైపు దృష్టి, సడెన్‌గా జనసేనలో ప్రత్యక్షం కావడంతో దీని వెనుక బిజెపి పెద్దలున్నారనే టాక్ వినపడుతోంది. ఇప్పటికే బిజేపీ నుంచి అద్దేపల్లి శ్రీధర్ జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించడం తెలిసిందే.