శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (18:06 IST)

2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కీలక ప్రకటన

2019 ఎన్నికల కోసం జనసేన సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాదులో పార్టీ కీలక నేతలతో జరి

2019 ఎన్నికల కోసం జనసేన సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాదులో పార్టీ కీలక నేతలతో జరిపిన సమావేశానికి అనంతరం పవన్ మాట్లాడుతూ.. జనసేనకు అనుభవం లేదని ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. 
 
గత రెండు ఎన్నికల్లో పనిచేసిన అనుభనం జనసేన కార్యకర్తలకు వుందని పవన్ వ్యాఖ్యానించారు. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్దామని కార్యకర్తలకు, పార్టీ ప్రతినిధులకు పవన్ పిలుపునిచ్చారు. ఏపీలో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. కుల, మత సామరస్యం కాపాడటమే ముఖ్యమని జనసేన నమ్ముతుందన్నారు. 
 
జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్‌ను పరిచయం చేశారు. తాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీపీఎఫ్) ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు దేవ్ టీం కలిసి ఎన్నికల ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు. 1200 మంది సీపీఎఫ్ కార్యకర్తలు దేవ్‌కు సహకరిస్తారని ప్రకటించారు. 350 మందితో దేవ్ టీమ్ పనిచేస్తుందని చెప్పారు. 
 
ఈ సందర్భంగా దేవ్ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేద్దామని పిలుపు నిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం తనకుందన్నారు. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. ఆయనకు చక్కని అవగాహన వుందని.. జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారని కొనియాడారు. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దామని దేవ్ వ్యాఖ్యానించారు.