సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (11:04 IST)

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులైతే.. పర్లేదు: చంద్రబాబు సెటైర్లు

బీజేపీ పెద్దల మాట మనం వినమని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చునని ఏపీ చంద్రబాబు నాయుడు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైర్లు

బీజేపీ పెద్దల మాట మనం వినమని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చునని ఏపీ చంద్రబాబు నాయుడు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైర్లు విసిరారు. తిరుపతిలో ధర్మ పోరాట సభలో మాట్లాడుతూ.. తమకు పదవులు ముఖ్యం కాదని, తాము వాటి కోసం ఎప్పుడూ పాకులాడలేదని స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరూ అడగక ముందే ఏక పక్షంగా కొందరు మద్దతు ఇస్తామని చెప్పారని.. ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మనం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే, పోరాడుతోన్న వారిపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
ఓ వైపు తాను ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తుంటే మరోవైపు వైకాపా నేతలు 'నయవంచన' పేరిట మీటింగులు పెడుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకన్న ఆశీస్సులతో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని బాబు అన్నారు