కర్నాటక ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తూ మరణించిన భాజపా ఎమ్మెల్యే  
                                          కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్(59) తీవ్ర గుండెపోటు రావడంతో ప్రచారంలోనే  మృతి చెందారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లోని పట్టాభిరామనగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే జయదేవ
                                       
                  
                  				  కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్(59) తీవ్ర గుండెపోటు రావడంతో ప్రచారంలోనే  మృతి చెందారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లోని పట్టాభిరామనగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే జయదేవ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చినా ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందాడు. 
	
				  
	 
	జయనగర్ నియోజకవర్గానికి విజయకుమార్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. వారం కిందట చికిత్స చేసుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన జయకుమార్ ఇంట్లో వాళ్లు ప్రచారానికి వద్దని వారించినా వినకుండా ప్రచారానికి వచ్చి గుండె నొప్పితో చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి