శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (15:25 IST)

కర్ణాటక నుంచే బీజేపీ పతనం ప్రారంభం : ప్రకాష్ రాజ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రం నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ఏర్పాటు చేసిన 'ప్రజాస్వామ్య ర

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రం నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ఏర్పాటు చేసిన 'ప్రజాస్వామ్య రక్షణ కోసం' అనే కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కన్నడలో మాట్లాడిన ప్రసంగాన్ని అనుకరించి చూపారు. కాయగూరలు అమ్మినట్టు ఏమిటండీ ఈ భాష అంటూ ఎద్దేవా చేశారు. మోడీగారి ప్రతాపం ఎంత అనేది ఈ నెల 15వ తేదీన వెలువడే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోతుందన్నారు. 
 
2019 ఎన్నికల తర్వాత మన దేశంలో మోడీకి పనేం ఉండదని... కర్ణాటకకు వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారని అన్నారు. కర్ణాటక ప్రచారంలో మోడీ కన్నడ ప్రసంగాన్ని ఎద్దేవా చేస్తూ, ప్రకాష్ రాజ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగాలను తప్పుబడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి... రాహుల్ వయసెంత? మీ వయసెంత? సిగ్గుగా లేదా అని అన్నారు. తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని... బీజేపీ అంటే తనకు భయం లేదని, న్యాయం ధర్మాలే తనకు రక్ష అంటూ వ్యాఖ్యానించారు.