శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : గురువారం, 10 మే 2018 (15:32 IST)

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్? ఎన్టీఆర్ పాత్ర అలా వుండదు?

ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా, తాజా షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ఈ సినిమా తరువాత చరణ్ రాజమౌళితో కలిసి సెట్స్‌ పైకి వెళ్ల

ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా, తాజా షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ఈ సినిమా తరువాత చరణ్ రాజమౌళితో కలిసి సెట్స్‌ పైకి వెళ్లనున్నాడు చెర్రీ. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నాడు.


ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ కలిసి అన్నదమ్ములుగా కనిపించనున్నారనీ, బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే టాక్ మెుదటి నుంచి కూడా బలంగా వినిపిస్తోంది.
 
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చరణ్ స్పందిస్తూ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పాడు. తాను ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించడం బాక్సింగ్ నేపథ్యం ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. అసలు కథ వేరే ఉందనీ అది అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.