శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (16:52 IST)

ఐపీఎల్ -11: సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం.. రైనా, ఆండ్రూల రికార్డ్ అదుర్స్

వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌‌లు ఆడిన సన్‌‌రైజర్స్‌… 9 విజయ

వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌‌లు ఆడిన సన్‌‌రైజర్స్‌… 9 విజయాలతో పాయింట్ల పట్టికలో (18 పాయింట్లతో) టాప్‌ ప్లేస్‌‌ను ఆక్రమించింది. ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లలో విజయం సాధించి 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
  
అయితే, ఐపీఎల్ కప్‌ను రెండుసార్లు ఎగరేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్లు, రన్‌రేట్ పరంగా కూడా రెండో స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాలకు పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో సన్ రైజర్స్, రెండో స్థానంలో చెన్నై, మూడో స్థానంలో పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు వరుసగా టాప్-6లో స్థానం సంపాదించుకున్నాయి. 
 
ఇకపోతే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన‍్నై సూపర్‌ సింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ప్రతీ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రైనా రికార్డు సాధించాడు. శుక్రవారం (మే 11) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా రైనా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.
 
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో భాగంగా 10 ఓవర్‌ రెండో బంతికి రైనా ఈ సీజన్‌లో మూడొందల పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. మరోవైపు గడిచిన ఐపీఎల్‌-10 సీజన్‌లలో రైనా టాప్‌-10లో చోటు సంపాదించుకున్నాడు.

ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన ఆండ్రూ టై అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఈ సీజన్లో ఆండ్రూ ఆడిన పది మ్యాచుల్లో 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.