గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 10 మే 2018 (15:00 IST)

ధోనీ తొలిప్రేమ గురించి చెప్పేశాడు...? భార్యతో మాత్రం చెప్పొద్దన్నాడు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన తొలి ప్రేమ గురించి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని తన భార్య సాక్షి వద్ద చెప్పకండి అంటూ కామెంట్స్ చేసి అందరినీ నవ్వించాడు. టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన తొలి ప్రేమ గురించి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని తన భార్య సాక్షి వద్ద చెప్పకండి అంటూ కామెంట్స్ చేసి అందరినీ నవ్వించాడు. టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత విషయాలను అంతగా బయటపెట్టేందుకు ఇష్టపడడు. అలాంటి వ్యక్తి.. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో తన తొలి ప్రేమ గురించి చెప్పడం అందరికీ షాక్‌నిచ్చింది. 
 
ఓ ఇంటర్వ్యూలో ధోనీ తన తొలిప్రేమ ఎవరితో అన్న విషయం చెప్పేశాడు. ఆ అమ్మాయి పేరు స్వాతి అని.. 12వ తరగతిలో ఉన్నప్పుడు చివరిసారిగా కలిశానని చెప్పాడు. ఈ కార్యక్రమానికి చెన్నై ఆటగాళ్లు షేన్‌వాట్సన్, సురేశ్ రైనా, రవీంద్రజడేజా కూడా హాజరయ్యారు. 
 
కాగా ధోనీ సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో మరో ప్రేమకథ కూడా ఉందని తాజాగా ధోనీ తెలిపాడు. తాను 12వ తరగతి చదువుతున్నప్పుడు ఈ తొలిప్రేమ చిగురించిందని, ఆ ఏడాదే ఆమెను చివరి సారి చూశానని.. ఆ తర్వాత ఆమెను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు.