1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మే 2018 (10:09 IST)

బెంగుళూరుకు షాకిచ్చిన సన్‌రైజర్స్ : ప్లే ఆఫ్ నుంచి కోహ్లీ సేన్ ఔట్?

ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు హైదరాబాద్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5పరుగుల తేడాతో గెలుపొంది కోహ్లీ సేనకు తేరుకోలేని

ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు హైదరాబాద్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5పరుగుల తేడాతో గెలుపొంది కోహ్లీ సేనకు తేరుకోలేని షాకిచ్చింది.
 
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ(39), కొలిన్ గ్రాండ్‌హోమ్(33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 
 
ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితంకావాల్సి వచ్చింది. షకీబ్ 2 వికెట్లు, భువనేశ్వర్, సందీప్, సిద్ధార్థ్, రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అదేసమయంలో కోహ్లీ సేనకు ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతయ్యాయి.