మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (10:44 IST)

ఆజాన్‌ స్కూల్‌లో ఆరేళ్ళ బాలికపై అత్యాచారం...

హైదరాబాద్ నగరంలో ఆరేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. నగరంలోని టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వాస్తవానికి ఈ పాఠశాల గత కొన్ని నెలలుగా వి

హైదరాబాద్ నగరంలో ఆరేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. నగరంలోని టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వాస్తవానికి ఈ పాఠశాల గత కొన్ని నెలలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గత వారం రోజులుగా పాఠశాలలో వరుసగా చిన్నారులపై లైంగికదాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 14న జరిగిన ఘటన ఇంకా సమసిపోక ముందే.... మరో ఘటన జరిగినట్లు గోల్కొండ పోలీసులకు ఈ నెల 19న ఫిర్యాదు అందింది.
 
తాజాగా జరిగిన అత్యాచారం ఘటనను పరిశీలిస్తే, టోలీచౌకి అజీజ్‌బాగ్ కాలనీలో నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూతురు (6) ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అయితే తమ కూతురుపై స్కూల్‌లో లైంగికదాడి జరిగినట్లు బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలికను గురువారం చిన్నారికి నీలోఫర్ దవాఖానలో పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై లోతుగా విచారిస్తున్నామని, పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.