1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad: Restaurant charges Re 1 for salt

చెంచాడు ఉప్పు ధర ఒక్క రూపాయి : హైదరాబాద్ రెస్టారెంట్ నిర్వాకం

అపుడెపుడో బ్రిటీష్ పరిపాలనలో ఉప్పుపై పన్ను వేసినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అపుడు జరిగిందో లేదో తెలియకు కానీ, ఇపుడు మాత్రం చెంచాడు ఉప్పుకు మాత్రం ఒక్క రూపాయి ధర వేశాడు. అదీకూడా 'మినీ ఇండియా'

Hyderabad
అపుడెపుడో బ్రిటీష్ పరిపాలనలో ఉప్పుపై పన్ను వేసినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అపుడు జరిగిందో లేదో తెలియకు కానీ, ఇపుడు మాత్రం చెంచాడు ఉప్పుకు మాత్రం ఒక్క రూపాయి ధర వేశాడు. అదీకూడా 'మినీ ఇండియా'గా వర్థిల్లుతున్న హైదరాబాద్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి సోమాజిగూడలో కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కుటుంబసమేతంగా డిన్నర్‌కు వెళ్లాడు. భోజనం చేశాక సోడాలోకి కొంచెం ఉప్పు కావాలని అడిగాడు. దీంతో సర్వర్లు ఉప్పు తెచ్చిపెట్టారు. 
 
ఆ తర్వాత వినియోగదారుడి చేతిలో బిల్లు పెట్టారు. ఈ బిల్లులో చెంచాడు ఉప్పుకు కూడా రూ.1 చార్జ్ చేశారు. దీంతో ఆ వినియోగదారుడు కొంత ఆశ్చర్యానికిగురై, అంతలోనే తేరుకుని ఉప్పుకు బిల్లేయడం ఎక్కడా చూడలేదనుకున్నాడు. కాగా, ఈ ఉప్పు ఛార్జీ విషయంపై సదరు రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది.
 
ఈ సంఘటన కావాలని చేసింది కాదని.. సాఫ్ట్‌వేర్‌లో తప్పిదం వల్లే జరిగిందని తెలియజేసింది. తాజాగా బిల్లు ఇచ్చే యంత్రాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశామని, దీన్ని గమనించకుండా క్యాషియర్ బిల్లు జారీ చేశాడని చెప్పుకొచ్చింది. కాగా, వినియోగదారుడిని ప్రసన్నం చేసుకునేందుకు లైమ్ సోడాకు రేటు రూ.150 తగ్గింపు ఇచ్చింది. అయితే, దాన్ని సదరు వినియోగదారుడు నిరాకరించాడు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఫినాయిల్ తాగిన రెడ్‌శాండిల్ క్వీన్, మోడల్ సంగీతా చటర్జీ (Video)