శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 9 సెప్టెంబరు 2017 (16:17 IST)

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని కసాయిగా మారిన కన్నతల్లి(వీడియో)

కట్టుకున్న భర్తను కాదని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఆ విషయాన్ని భర్తకు పిల్లలు ఎక్కడ చెప్పేస్తారేమోనని అతి దారుణంగా చంపేసింది. కన్నతల్లి ఇద్దరు బిడ్డలను గొంతు నులిమి చంపేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జరిగిన ఈ సంఘటన తీవ్

కట్టుకున్న భర్తను కాదని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఆ విషయాన్ని భర్తకు పిల్లలు ఎక్కడ చెప్పేస్తారేమోనని అతి దారుణంగా చంపేసింది. కన్నతల్లి ఇద్దరు బిడ్డలను గొంతు నులిమి చంపేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 
 
ఇద్దరు బిడ్డలను హత్య చేసిన ఆ తల్లి పరారైంది. రామకుప్పం మండల పరిధి పంద్యాలమడుగు పంచాయతీ కవ్వంపల్లె గ్రామానికి చెందిన పవిత్రకు వేమారెడ్డికి ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి రుత్విక్ రెడ్డి, ధనుష్‌ రెడ్డి ఇద్దరు పిల్లలున్నారు. ఎప్పటిలాగే వేమారెడ్డి పొలం పనులకు వెళ్ళాడు. 
 
ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య పవిత్ర కనిపించలేదు. దీంతో పవిత్రే ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం చిన్నారుల మృతికి కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియో...