ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (15:15 IST)

కిడ్నాప్ చేసి.. 29 రోజుల పాటు 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్: నదిలో ఈదుకుంటూ..?

అమెరికాలోని మినసోట్టా ప్రావిన్స్‌లో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి నిర్భంధించి నెలపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మినసొట్టా, అలె

అమెరికాలోని మినసోట్టా ప్రావిన్స్‌లో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి నిర్భంధించి నెలపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మినసొట్టా, అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన 15ఏళ్ల జాస్మిన్ బ్లాక్.. గత ఆగస్టు 8వ తేదీన అపహరణకు గురైంది. ఆమెను తెలిసిన వ్యక్తే కిడ్నాప్ చేశాడు.
 
కిడ్నాప్ చేసిన థామస్ అనే వ్యక్తి తన కుటుంబంలో ఏదో సమస్యని దాన్ని పరిష్కరిచేందుకే తీసుకెళ్తున్నట్లు జాస్మిన్ వద్ద చెప్పాడు. దీన్ని నమ్మిన జాస్మిన్ కారులో కూర్చుంది. కారు ఎక్కగానే జాస్మిన్‌ను ఆయుధాలతో భయపెట్టాడు. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 29 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలిక గ్రాండ్ కెన్నడీ అనే చెరువులో పడిపోయింది. కానీ ఈత తెలియడంతో బాలిక చెరువులో ఈదుకుంటూ ఓ వ్యవసాయం చేసే వ్యక్తి సాయంతో బయటపడింది. అతనికి జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.