శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (09:52 IST)

ఫ్రెండ్స్‌తో మాట్లాడిందనీ.. పీక పిసికి చంపేశాడు... ఎక్కడ?

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తాను ప్రేమించే యువతి ఆమె ఫ్రెండ్స్‌తో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పీక పిసికి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తాను ప్రేమించే యువతి ఆమె ఫ్రెండ్స్‌తో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పీక పిసికి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి, 19 ఏళ్ల నిందితుడు సర్థక్‌ కపూర్‌ స్కూల్లో జూనియర్‌. అప్పటి నుంచే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రస్తుతం యువకుడు బీసీఏ చదువుతుండగా, ఆ యువతి ఫ్లస్‌ టూ చేస్తోంది. వీరిద్దరు రోజు సాయంత్రం స్థానికంగా ఉండే పార్క్‌లో కలుకునేవారు. 
 
అయితే ఈ మధ్య స్కూల్‌లో తోటి విద్యార్థులతో ఆమె సన్నిహితంగా ఉంటూ వస్తోంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం కూడా చోటుచేసుకునేది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇదే అంశంపై తగువులాడుకోగా, కోపంతో ఆ యువకుడు యువతి పీక పిసికేశాడు. కాసేపటికి యువతి నిర్జీవంగా పడి ఉండటంతో చనిపోయిందని నిర్ధారించుకుని భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
అయితే, తమ కూతురు స్కూల్ నుంచి ఇంటికి రాకపోవటంతో యువతి స్నేహితుల వద్ద ఆరా తీయగా వారు తమకేం తెలియదన్నట్టుగా చెప్పారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలోభాగంగా, కపూర్ కదలికలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం వెలుగుచూసింది. రోహిణి పార్క్ వద్ద యువతి శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.