సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:33 IST)

జార్ఖండ్‌లో 14ఏళ్ల చిన్నారి గ్యాంగ్ రేప్.. డ్రైనేజీలో పడేశారు..

జార్ఖండ్‌లో 14 ఏళ్ల చిన్నారి సామూహిక అత్యాచారానికి గురైంది. నలుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. డ్రైనేజీలో విసిరిపారేశారు. వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల బాలిక జార్ఖండ్ బగ్మెరా ప్రాంతంలోని తన బంధువుల ఇ

జార్ఖండ్‌లో 14 ఏళ్ల చిన్నారి సామూహిక అత్యాచారానికి గురైంది. నలుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. డ్రైనేజీలో విసిరిపారేశారు. వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల బాలిక జార్ఖండ్ బగ్మెరా ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంటికి చేరుకుంటుండగా.. నలుగురు ఆ చిన్నారి వెంటపడ్డారు. 
 
చిన్నారిని ఆ నలుగురు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. అత్యాచారానికి అనంతరం ఆ బాలికను ఆ దుండగులు డ్రైనేజీలో విసిరిపారేశారు.
 
ఆపై కోలుకున్న ఆ బాలిక సహాయార్థం అరవడంతో సమీపంలో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కోసం గాలిస్తున్నారు.