మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (10:27 IST)

సైన్స్ క్లాస్ పేరుతో విద్యార్థినిని తాకరానిచోట తాకిన ట్యూటర్...

కోచింగ్ సెంటర్‌కు ట్యూషన్‌కు వెళ్లిన ఓ విద్యార్థినిని కామాంధుడైన ట్యూటర్ సైన్స్ క్లాస్ పేరిట తాకరాని చోట తాకాడు. అంతేనా.. తన వికృత చేష్టలతో ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వ

కోచింగ్ సెంటర్‌కు ట్యూషన్‌కు వెళ్లిన ఓ విద్యార్థినిని కామాంధుడైన ట్యూటర్ సైన్స్ క్లాస్ పేరిట తాకరాని చోట తాకాడు. అంతేనా.. తన వికృత చేష్టలతో ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై సినీటికి చెందిన తుషార్ అనే యువకుడు ఘన్సోలీలో సెక్టార్ 5 అనే ఏరియాలో ముక్తా కోచింగ్ పేరిట ఓ ట్యూషన్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఈ ట్యూషన్ సెంటరుకు వచ్చే 15 ఏళ్ల బాలికను తుషార్ సైన్స్ ప్రాక్టికల్స్ పాఠాలు బోధిస్తున్నట్టుగా దగ్గరకు తీసుకుని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు.
 
దీంతో ట్యూటర్ లైంగిక వేధింపులపై అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఘన్సోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక ఉపాధ్యాయుడిపై ఐపీసీ 506, సెక్షన్ 8, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడైన తుషార్‌ను అరెస్టు చేశారు.