శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (13:50 IST)

జార్ఖండ్‌‌లోని జండెష్‌పూర్‌లో ఘోరం: 52మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదులు సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి మరు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదులు సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి మరువక ముందే జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జండెష్ పూర్‌లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన నెల రోజుల వ్యవధిలో 52 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 
 
ఈ చిన్నారుల మృతికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాకపోగా, సరైన పోషకాహారం లభించని కారణంగానే వీరంతా మృత్యువాత పడినట్లు ఆస్పత్రి సూపరింటెండ్ తెలిపారు. చిన్నారుల మరణాలు నిజమేనని ధ్రువీకరించారు.