1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jaganmohan Reddy comments on Pawan Kalyan, Chiranjeevi responds

'తమ్ముడు'పై జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు... చిరంజీవి ఏమన్నారో తెలుసా?

కుటుంబంలో తగాదాలు వచ్చి విడిపోయినాసరే రక్తబంధమనేది కొనసాగుతూనే ఉంటుందనేది మెగా ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి. రాజకీయాల్లోకి వెళ్ళిన తమ్ముడిపై విమర్శలు చేస్తున్న వారిని అన్న చిరంజీవి గమనిస్తూనే వస్తున్నారు. తన సన్నిహితులు, స్నేహితులతో తన ఆవేదనను పంచుకు

Jaganmohan Reddy
కుటుంబంలో తగాదాలు వచ్చి విడిపోయినాసరే రక్తబంధమనేది కొనసాగుతూనే ఉంటుందనేది మెగా ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి. రాజకీయాల్లోకి వెళ్ళిన తమ్ముడిపై విమర్శలు చేస్తున్న వారిని అన్న చిరంజీవి గమనిస్తూనే వస్తున్నారు. తన సన్నిహితులు, స్నేహితులతో తన ఆవేదనను పంచుకుంటున్నారు. అంతేకాదు తమ్ముడికి కొన్ని సలహాలను కూడా రహస్యంగా చిరంజీవి ఇస్తున్నారనే వాదన కూడా వుంది.
 
తాజాగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ జగన్ పవన్ పైన ఆరోపణలు చేశారు. కార్లు మార్చినంత ఈజీగా భార్యలను పవన్ మార్చేస్తారంటూ విమర్శించారు. ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే విషయంపై చిరంజీవి తన కుటుంబ సభ్యులతో మాట్లాడారట. 
 
నా తమ్ముడిని అలా మాట్లాడిన వ్యక్తిని అలా వదిలేయాలని చెప్పారట. రాజకీయాల్లో సహనం అవసరం. అనవసరంగా ఎవరిపైనా విమర్శలు, ఆరోపణలు చేయకూడదు. ఆ విషయాన్ని ఎన్నోసార్లు కళ్యాణ్‌కు నేను చెప్పానంటూ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించారట.
తర్వాతి కథనం
నీ కొడుకు భవిష్యత్ కోసం నా కోర్కె తీర్చు... హెడ్ మాస్టర్ బాగోతం