బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 25 జులై 2018 (18:10 IST)

కార్లలా భార్యలను మార్చే పవన్ అన్న జగన్ వ్యాఖ్యపై పవన్ కళ్యాణ్ పంచ్

కార్లు మార్చినంత ఈజీగా భార్యలను మార్చేస్తాడు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యను మార్చేయడం పవన్ కళ్యాణ్‌‌కు అలవాటు. విలువ గురించి పవన్ కళ్యాణ్‌ మాట్లాడటం నిజంగా మన కర్మ. ఇదంతా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇది కాస్తా రెండు తెలుగు రాష

కార్లు మార్చినంత ఈజీగా భార్యలను మార్చేస్తాడు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యను మార్చేయడం పవన్ కళ్యాణ్‌‌కు అలవాటు. విలువ గురించి పవన్ కళ్యాణ్‌ మాట్లాడటం నిజంగా మన కర్మ. ఇదంతా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇది కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగన్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నాయి. అయితే ఇదే విషయంపై జగన్ మోహన్ రెడ్డికి పంచ్ వేశారు పవన్ కళ్యాణ్‌. 
 
బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న జగన్ తన వ్యక్తిగత విషయాలు మాట్లాడటంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా రాజకీయం చేయడం ఇదే ఆయనకు తెలిసిన దిగజారుడు చిల్లర రాజకీయం. జనసేన పోరాట యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుండటంతో జగన్ ఇలా మాట్లాడి ఉండవచ్చని, వ్యక్తిగతంగా ఈ సమస్య నాకు సంబంధించింది మాత్రమే. అయితే ఈ సమస్య సమాజం మీద కొంతమేర ప్రభావం చూపితే దీనిపై మాట్లాడవచ్చు. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు. నన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే ప్రతి వారికి చెబుతున్నా... అన్నారు పవన్ కళ్యాణ్.
 
అయితే దీనిపై అభిమానులెవరూ రెచ్చిపోయి ఎలాంటి ప్రకటనలు చేయొద్దంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు. విలువలు గురించి మాట్లాడే ముందు మనం ఏం విలువలు పాటించామో జగన్ తెలుసుకుంటే మంచిదన్నారు పవన్ కళ్యాణ్.