1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 25 జులై 2018 (09:23 IST)

కార్లు మార్చినట్టు పెళ్లాలను మార్చుతాడు.. పవన్‌ పతివ్రతా!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ విమర్శలు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ విమర్శలు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా పవన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా మంగళవారం బంద్‌ తలపెట్టింది. ఈ బంద్ తర్వాత జగన్ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో మీడియాతో మాట్లాడారు. 'అసెంబ్లీ నుంచి జగన్‌ పారిపోయారు' అంటూ పవన్ చేసిన విమర్శలపై జగన్ స్పందించారు.
 
"మన ఖర్మేమిటంటే. ఇవాళ పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా ఇది మన ఖర్మ. నాలుగేళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబుతోనూ, బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి, నేను తప్పు చేశానని ఆయన పతివ్రతనని అని చెబుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముగ్గురూ కలిసి పొడిచేశారు. నాలుగేళ్లు గమ్మునున్న తర్వాత, ఎన్నికలకు ఆరు నెలలు ఉందనగా బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడతారు. 
 
ఒకాయన.. నేను తప్పు చేశానని అంటాడు. మరొకాయన.. నేను తప్పు చేయలేదు. మిగతా ఇద్దరూ నన్ను మోసం చేశారని అంటారు. ఇంకొకాయన.. ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే నేను చంపేశాను అని అంటాడు. ఇక పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకోసారో ఏడాదికోసారో బయటకు వస్తాడు. ఒకరోజు ఒక ట్వీటిస్తాడు. లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. నాలుగేళ్లూ కూడా ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ చంద్రబాబును రక్షించడానికే బయటకు వచ్చాడు. 
 
ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే, దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలంటే, నిజంగా ఎక్కడివీ విలువలు!? విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండీ తనకు విలువలు? నలుగురు నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టు పెళ్లాన్ని మారుస్తాడు. 
 
నాలుగేళ్లకోసారి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడు. ఇలాంటి పనిని నేనో నువ్వో మరొకరో చేసి ఉంటే.. ఏమందురు!? నిత్య పెళ్లికొడుకని చెప్పి జైల్లో వేసేవారా కాదా!? ఇది పాలిగామీ (బహు భార్యత్వం) కాదా? ఇలాంటోళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీలుడినని మాట్లాడడం.. వాళ్లను సీరియ్‌సగా తీసుకుని వాళ్ల గురించి కూడా విశ్లేషించుకోవడం అంటే బాధేస్తుంది" అంటూ విరుచుకుపడ్డారు.