మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 24 జులై 2018 (20:55 IST)

మొన్న కన్ను... ఇవాళ కాలు... ఏంటండీ పవన్‌కి ఈ కష్టాలూ...?(ఫోటోలు)

నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ తన కన్నుకు ఆపరేషన్ చేసుకున్నారు. కంటికి సంబంధించి సమస్యతో చానాళ్లు ఇబ్బందిపడ్డారు. నల్ల కళ్లజోడు పెట్టుకుని తిరిగారు. ఆడియో ఫంక్షన్లకు సైతం నల్లద్దాలు పెట్టుకుని వచ్చారు. ఆ సమస్యతోనే ఉత్తరాంధ్ర పర్యటన చేశారు. ఇక ఇప్పుడు పశ

నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ తన కన్నుకు ఆపరేషన్ చేసుకున్నారు. కంటికి సంబంధించి సమస్యతో చానాళ్లు ఇబ్బందిపడ్డారు. నల్ల కళ్లజోడు పెట్టుకుని తిరిగారు. ఆడియో ఫంక్షన్లకు సైతం నల్లద్దాలు పెట్టుకుని వచ్చారు. ఆ సమస్యతోనే ఉత్తరాంధ్ర పర్యటన చేశారు. ఇక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రకు వెళ్లిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాలు బెణికింది. 
 
దీనితో భీమవరంలోని ఎన్.డి.ఫంక్షను హాలులో బస చేశారు. మంగళవారం పవన్ కళ్యాణ్‌ను కలిసిసేందుకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో నేల తడిగా ఉండటంతో కాలు స్కిడ్ అయింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కుడి కాలు బెణికింది. వెంటనే బ్యాండేజీతో కట్టు వేశారు. నొప్పితో ఇబ్బందిపడ్డారు. 
 
ఆ నొప్పితోనే జన సైనికుల్ని కలిసి మాట్లాడారు. వైద్యులు వచ్చి పరీక్షించారు. నొప్పి నివారిణులు వాడాలని చెప్పారు. కాలుకి క్యాప్ వేసి స్వల్ప విశ్రాంతి అవసరం అని సూచించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.