శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (12:04 IST)

పెళ్లికి ముందే సిద్ధమంటున్న రేణూ దేశాయ్...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, నటి రేణూ దేశాయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుంది. అయితే, ఈ పెళ్లికి ముందే ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచార

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, నటి రేణూ దేశాయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుంది. అయితే, ఈ పెళ్లికి ముందే ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే పుకారు షికారు చేస్తోంది.
 
నిజానికి ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణూ దేశాయ్... పవన్ నుంచి విడిపోయాక కూడా నటనపై దృష్టి పెట్టలేదు. ఇటీవల బుల్లితెరపై ఓ రియాలిటీ షోలో కనిపించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కానీ నటనకు మాత్రం దూరంగానే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవలే రేణుకి మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఆమె తన వివాహానికి ముందే నటిగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. వివాహం తర్వాత రేణు ఎంట్రీ ఉంటుందని మరొక వాదన కూడా ఉంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడితే తప్ప క్లారిటీ రాదు. 
 
కాగా, పవన్ సరసన కథానాయికగా 'బద్రి', 'జానీ' సినిమాల్లో నటించారు. ఈ సినిమాలతోనే వారిద్దరి స్నేహం ప్రేమగా మారడం.. ఆ తర్వాత సహ జీవనం.. ఇద్దరు పిల్లలు.. దీంతో ఆమె కొన్నేళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న విషయం తెల్సిందే.