1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Jana Sena Chief Pawan Kalyan counter to AP CM Chandrababu Naidu

ఒక్క సీటు కూడా గెలవలేని పార్టీతో చెలిమి చేస్తామా? పవన్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. తనపైనా, తమ పార్టీపైనా చంద్రబాబు చేసిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు.

Jana Sena
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. తనపైనా, తమ పార్టీపైనా చంద్రబాబు చేసిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా, బీజేపీకి నష్టం కలగకూడదని జనసేన ట్వీట్లు చేస్తోందంటూ శుక్రవారం రాత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ సమాధానమిచ్చారు.
 
"పీలో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీని వెనకేసుకు రావటానికి మాకు వచ్చే లాభమేమిటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో రాష్ట్రంలో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? నా ట్వీట్ల వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బీజేపీతో సమానంగా టీడీపీ కూడా అంతే దారుణంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది. ప్రజలను మోసం చేశారు. వంచించారు" అంటూ నిప్పులు చెరిగారు.
 
తాము చెప్పే విషయాలన్నీ ఇపుడే తెలుసుకున్నట్టుగా తెలుగుదేశం ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోయాయని ఆరోపించారు. గత నాలుగేళ్లలో హోదాపై చంద్రబాబు, టీడీపీ ఎన్ని రకాలుగా మాటలు మార్చిందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. తన వైఖరితో ఆంధ్ర ప్రజలను ఆత్మగౌరవం లేనివారిగా నిలిపారని, మోడీ కాళ్లకు టీడీపీ ఎంపీలు పాదాభివందనం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పవన్ ప్రశ్నించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నవ వధువుకు మత్తుమందిచ్చి... రోజుకు పది మంది చొప్పున అత్యాచారం..