మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జులై 2018 (17:13 IST)

రేణూ దేశాయ్ బాటలో సునీత.. రెండో పెళ్లి చేసుకుంటారా? ఎఫ్‌బీలో ఏమన్నారు?

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 19ఏళ్లలోనే వివాహం చేసుకున్న సునీత, ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి.. వి

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 19ఏళ్లలోనే వివాహం చేసుకున్న సునీత, ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి.. విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఇప్పటివరకు వందలాటి పాటలను పాడిన సునీత... డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా బిజీగా ఉన్నారు. 
 
రాశి, భూమిక, అనుష్క, జ్యోతిక, ఛార్మి, మీరా జాస్మిన్, లైలా, సోనాలీ బెంద్రే, సౌందర్య, రిచా గంగోపాధ్యాయ్, శ్రియ, స్నేహ, జెనీలియా, కత్రినా కైఫ్, తమన్నా, ఇలియానా, కమిలినీ ముఖర్జీ, త్రిష, నయనతార వంటి టాప్ హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు. 40 ఏళ్ల వయసున్న సునీతకు 20 ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. భర్త నుంచి విడిపోయిన చాలాకాలానికి రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో సునీత రెండో వివాహం చేసుకోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
సునీత కూడా రేణు దేశాయ్ బాటలో నడుస్తున్నారని టాక్ వచ్చింది. అయితే తన రెండో పెళ్లి వార్తలపై సునీత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడు ఎందుకంత ఆసక్తి కనబరుస్తారు. అంటూ ఫేస్‌బుక్ ద్వారా ఆమె అడిగారు. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.