సంబంధిత వార్తలు
- పవన్ కళ్యాణ్ పైన కత్తి మహేష్ దారుణ వ్యాఖ్యలు.. మజాక్‌గా అనిపిస్తోందా? అంటూ వ్యంగ్యం
- నొప్పి లేకుండా ఎలా చనిపోవచ్చు... వీడియో చూసి ప్రాక్టికల్ చేసిన వ్యక్తి!
- హైదరాబాద్‌లో దారుణం.. ఆఫీసులోనే మహిళా తాహశీల్దారు సజీవదహనం
- రజక కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు... ఎక్కడ?
- కర్నూలు కత్తివా, గుంటూరు మిర్చివా.. హన్సిక లైన్లో పెట్టేందుకు?
పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిన యూకేజీ బాలుడు మృతి.. ఎలా?
కర్నూలు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వేడివేడి సాంబారు పాత్రలో పడిన ఓ యూకేజీ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుసలో నిలబడివుండగా, వెనుక ఉన్న విద్యార్థి నెట్టివేయడంతో ఈ ఘటన జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి, కల్పన అనే దంపతులకు ఆరేళ్ళ పురుషోత్తం రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు పాణ్యంలోని విజయానికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.
రోజూలాగానే బుధవారం మధ్యాహ్నం పురుషోత్తం భోజనం కోసం క్యూలో నిల్చున్నాడు. ఈ క్రమంలో వెనకున్న విద్యార్థులు నెట్టివేయడంతో అదుపుతప్పిన చిన్నారి పురుషోత్తం ముందున్న పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిపోయాడు.
ఆ తర్వాత పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థి శరీరంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బుధవారం రాత్రి పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
