సంబంధిత వార్తలు
- చిట్టి ఈజ్ బ్యాక్.. 'లకలక స్థానంలో కుక్కురు'... #2Point0Teaser
- చిన్నప్పటి నుంచి స్వయంతృప్తి అలవాటు ఉంది.. తప్పా? ఒప్పా?
- పెళ్లి చేస్కుంటావా? లేదంటే నీ భర్తను చంపమంటావా? ఏంటో చెప్పు నీ యవ్వారం...
- ఏం చేయను.. బ్రేకప్ జరిగిన విషయం నిజమే... రష్మిక మందన్న
- ప్లీజ్.. రష్మికను విలన్లా చూడొద్దు: రక్షిత్ శెట్టి
పెళ్లి చేసుకుని పడక సుఖం పొందాడు.. ఇపుడు వద్దుపో అంటున్నాడు...
హైదరాబాద్ నగరంలో మరో జూనియర్ ఆర్టిస్టు ఓ కామాంధుడి చేతిలో మోసపోయింది. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం చేసి పడక సుఖం పొందాడు. ఇపుడు నీవు నాకొద్దుపో అని అంటున్నాడంటూ బాధితురాలు
హైదరాబాద్ నగరంలో మరో జూనియర్ ఆర్టిస్టు ఓ కామాంధుడి చేతిలో మోసపోయింది. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం చేసి పడక సుఖం పొందాడు. ఇపుడు నీవు నాకొద్దుపో అని అంటున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
వైజాగ్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ (30) కృష్ణనగర్ బీ బ్లాక్‌లో నివసిస్తుంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా 2016లో విజయవాడకు చెందిన, పరిశ్రమలో ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న చైతన్యతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సహజీవనం చేశారు. ఆ తర్వాత ఇంట్లోనే దేవుడి చిత్రపటం ముందు తాళి కట్టాడు.
ఈ విషయాన్ని పెద్దలకు సైతం చెప్తానని యువతిని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో కొద్ది రోజుల పాటు పడక సుఖం పొందాడు. ఈ నేపథ్యంలో గత నెల 13న ఇంటికొచ్చిన అతని బంధువులు బలవంతంగా చైతన్యను విజయవాడకు తీసుకెళ్లారు. చరవాణిలో అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించినా నిరాకరించాడు. బుధవారం ఈ మేరకు బాధిత యువతి చైతన్యపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైతన్యపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
