1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Man loses unusual attempted rape case

అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని కళ్లలో కారం కొట్టి.. కారు దిగి కేకలు వేసింది..!

తనపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని కళ్లలో కారం కొట్టి ఓ మహిళ తప్పించుకుంది. ఈ సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం మండలం సీతాపురం తండా వద్ద చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే... నూజివీడు గ్రామానికి చెందిన మహ

Man
తనపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని కళ్లలో కారం కొట్టి ఓ మహిళ తప్పించుకుంది. ఈ సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం మండలం సీతాపురం తండా వద్ద చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే... నూజివీడు గ్రామానికి చెందిన మహిళ(27) ఊరి నుంచి రెడ్డి గూడెం వెళ్లేందుకు సోమవారం రాత్రి 10గంటల సమయంలో బస్సు కోసం ఎదురుచూస్తోంది. చాలా సేపు నుండి బస్సు రాకపోయేసరికి ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామని నిర్ణయించుకుంది. ఆ సమయంలో అటువైపుగా కారులో వచ్చిన బాబూరావు అనే వ్యక్తి రెడ్డిగూడెం వైపే బండి వెళ్తోందని ఆమెను ఎక్కించుకున్నాడు. 
 
కారు సీతాపురం చేరిన తర్వాత కూనపరాజు పర్వకు వెళ్లే రహదారి వైపు దారి మళ్లించాడు. ఎవ్వరూ లేని నిర్మానుష్య స్థలంలో మహిళపై అత్యాచారానికి యత్నించాడు. తన శీలాన్ని కాపాడుకోవడానికి... ఆత్మరక్షణ కోసం తన దగ్గర దాచుకున్న కారాన్ని తీసుకుని ఆ కామాంధుడి కళ్లలో కొట్టి, కారు దిగి కేకలు వేసింది. ఆ సమయంలో తనను కాపాడ్డానికి ఎవరూ లేకపోవడంతో తల్లికి ఫోన్ చేసింది. 
 
బాధితురాలి తల్లి వెంటనే రెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి బాబూరావు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కారును సీజ్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తర్వాతి కథనం
ఆయనేమో అమెరికా మైనె గవర్నర్.. కానీ ఆయన భార్య మాత్రం హోటల్‌లో వెయిటర్‌గా..?!