శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (15:26 IST)

ఒకే ఊరబ్బాయి అని బైకెక్కింది.. అంతే మార్గమధ్యంలో రేప్ చేశాడు..

ఒకే ఊరు అబ్బాయి. లిఫ్ట్ ఇస్తానన్నాడు. దీంతో నమ్మి బైకెక్కి కూర్చున్న యువతిపై మార్గ మధ్యలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు సమీపంలోని కొరటపల్లి ప్రాంతానికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్లేందుకు వేచి చేస్తోంది. అదే గ్రామానికి చెందిన మేకల సురేష్ అనే వ్యక్తి ఆ సమయంలో బైక్ పై వచ్చాడు. తాను కూడా కరీంనగర్‌కే వెళ్తున్నానని.. లిఫ్ట్ ఇస్తానని అన్నాడు. 
 
రోజూ చూసే వ్యక్తేకదా అని ఆమె కూడా బైకెక్కింది. కానీ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో బండి ఆపిన నరేష్.. ఆమెను బెదిరించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.