శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (14:41 IST)

ఇద్దరు చిన్నారులపై మైనర్ బాలుడు అత్యాచారం

మచిలీపట్నంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 5 సంవత్సరాల చిన్నారులపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… అరుణోదయ కాలనీలో నివాసం ఉండే ఓ మైనర్ బాలుడు (17) ఐటీ చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉండే 5 సంవత్సరాల చిన్నారులను చాకెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

భయబాంత్రులకు గురైన ఇద్దరు చిన్నారులు ఏడ్చూకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తల్లిదండ్రులు ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.