అత్యాచారాలు జరగకపోయుంటే మానవజాతి ఉండేదా?

steve king
ఎం| Last Updated: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:37 IST)
అత్యాచారాలు జరగకపోయుంటే మానవజాతి ఉండేదా అని అమెరికన్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ నేత స్టీవ్‌ కింగ్‌ అన్నారు. ఇప్పుడు ఆయన మాటలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ "చరిత్రలో కుటుంబాల వంశవృక్షాలన్నింటినీ పరిశీలించి.. అత్యాచారం, వావివరుసలులేని లైంగిక సంబంధాల వల్ల పుట్టిన వారందరినీ పక్కన పెడితే ప్రపంచంలో మానవ జనాభా ఉంటుందా?

ఈ ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలు, అత్యాచారాలు, దోపిడీలను పరిశీలిస్తే నేను కూడా అలా సంభవించిన ఉత్పత్తిలో భాగం కానని చెప్పలేను" అని అన్నారు. ఇప్పుడు ఆయన మాటలు టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారాయి.
దీనిపై మరింత చదవండి :