1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MLA Balakrishna comments on Nandyal By Poll Results

ఇక టీడీపీకి పార్టీకి తిరుగులేదు: ఎమ్మెల్యే బాల‌కృష్ణ

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భూమా బ్రహ్మానంద‌రెడ్డికి అభినంద

Nandyal By Poll Results
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భూమా బ్రహ్మానంద‌రెడ్డికి అభినంద‌న‌లు తెలుపుతూ ఓ ప్రకటన చేశారు. 
 
అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న త‌మ పార్టీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ ఉంటుంద‌ని ఈ విజ‌యంతో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని ప‌త్రికా ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. టీడీపీ శ్రేణులు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న కోరారు. 
 
ఈ ఎన్నిక ఫలితంలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టమైందన్నారు. అందువల్ల మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఇది రెఫరెండం ఎలా అవుతుందమ్మా?.. నువ్వే చెప్పమ్మా? : జగన్ మోహన్ రెడ్డి