శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:47 IST)

నానీ లాంటి వెధవలకు పదవులివ్వబట్టే రాష్ట్రం అథోగతి పాలైంది: హమ్మ! బ్రహ్మం ఎంత మాటనేశాడూ?

పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మంత్రి అయ్యాక, రాష్ట్ర ప్రజలకు ఏంచేశాడో చెప్పుకోలేని దీనస్థితిలోఉన్నాడని, దాంతో తన మంత్రిపదవి పోతుందున్న నిరాశానిస్పృహలతో అతను చంద్రబాబుపై, టీడీపీనేతలపై నోరుపారేసుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆక్షేపించారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాక్షసులు ద్వేషంతో హరినామస్మరణ చేసినట్లుగా, కొడాలినాని నిత్యం చంద్రబాబునామస్మరణ చేస్తున్నా డని బ్రహ్మం ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని మహిళలందరూ రేషన్ దుకాణాల్లో తమకు సరకులు అందడం లేదని వాపోతూ, సదరు శాఖకు చెందినమంత్రిని చీపుర్లలో సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని బ్రహ్మం తెలిపారు.

సన్నబియ్యం ఇస్తానని చెప్పిన సన్నాసికి బుద్దిచెప్పడానికి పేదవిద్యార్థులంతా కడుపుమంటతో దుడ్డుకర్ర పట్టుకొని తిరుగుతున్నారన్నారు. ఈవిషయాలేవీ తనకు తెలియవన్నట్లుగా నానీ, చంద్రబాబుని ఉద్దేశించి బడితపూజ చేస్తానంటున్నాడని, దాని అర్థం అతను చంద్రబాబుని చంపుతా అనడమేనని, అలా మాట్లాడిన నానీ తక్షణమే తనమాటలను వెనక్కు తీసుకోవాలని, బేషరతుగా చంద్రబాబుకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నానీ తనతప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పకపోతే, అతని వ్యాఖ్యలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని టీడీపీనేత స్పష్టంచేశారు. పదేపదే చంద్రబాబుని దూషించడం నానీకి అలవాటైందని, అతను మంత్రిఅన్న విషయం మర్చిపోయిస్థాయిని మరిచి మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబుకి బడితపూజ చేస్తానన్న నానీకి బడితను (దుడ్డుకర్ర) పంపిస్తున్నట్లు చెప్పిన బ్రహ్మం, అతనికి దమ్ము, ధైర్యముంటే, సమయం,స్థలం చెబితే, తానే స్వయంగా నానీ దగ్గరికివెళతానని చెప్పారు. 

చంద్రబాబుని దూషించడాన్ని నానీ తక్షణమే మానుకోవాలన్నారు. నానీలాంటి వెధవలకు పదవులిచ్చినవ్యక్తి  పెద్ద అడ్డగాడిద అని, అతనొక లత్కోర్ అని,  బ్రహ్మం ఆగ్రహం వ్యక్తంచేశారు. నానీలాంటి వారికి మంత్రిపదవులివ్వబట్టే రాష్ట్రం అథోగతిపాలైందన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలను మోసగించి, ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర నాయకుడుఏంచేశాడో ప్రజలకుచెప్పే ధైర్యం నానీకి ఉన్నాయా అని బ్రహ్మం నిలదీశారు.

కల్లబొల్లి మాటలు, బూతులతో కాలం గడుపుతున్న మంత్రులు, వారి నాయకుడి పనితీరుగురించి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశాడో చర్చించడానికి నానీసిద్ధమైతే, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి ఏంచేశాడో చెప్పడానికి తాను సిద్దమని బ్రహ్మం తెలిపారు.

చంద్రబాబునాయుడి హాయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతల అమలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగఉపాధి అవకాశాలపై చర్చించడానికి తాను అన్నివేళలా సిద్ధమేనని, అవే అంశాలపై తనతో చర్చించడానికి నానీ సిద్ధమో కాదో ఆయనే సమాధానం చెప్పాలని బ్రహ్మం తేల్చిచెప్పారు. 

మంత్రిగా ఉన్న నానీ, అశుద్ధం తినే పందిమాదిరి ప్రవర్తిస్తూ, రాష్ట్ర రాజకీయాలను, రాష్ట్రంలోని నేతలను అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నాడని బ్రహ్మం మండిపడ్డారు. కుక్కలా మొరుగుతూ, మంత్రిపదవికోసం నానీ అర్రులు చాస్తున్నా డన్నారు.  కొడాలినానీ దున్నపోతా, మనిషా, గ్రహాంతరవాసా అని ప్రజలంతా వాపోతున్నారని, గుడివాడ ప్రజలైతే ఛీ ఇతనా మా మంత్రి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారన్నారు.

ఖైనీలు నములుతూ, కూనీ మాటలు మాట్లాడటం నానీకి అలవాటైందని, అతను తనప్రవర్తన మార్చుకోకుంటే అనేక కష్టాలు పడాల్సి వస్తుందని బ్రహ్మం సుతిమెత్తగా హెచ్చరించాడు.  చంద్రబాబుని ఒక్కక్షణం కూడా ఉండనని బెదిరించే నానీకి దమ్ముంటే, అతనుబయటకు రావాలని, తెలుగుదేశం కార్యకర్తలే అతనికి  తగిన విధంగా సమాధానం చెబుతారని బ్రహ్మం హెచ్చరించారు.

కార్యక్రమంతో, సమయం, సందర్భంతో పనిలేకుండా చంద్రబాబుని తిట్టడమే నానీ పనిగాపెట్టుకున్నాడని, ఆ వ్యక్తి గతంలో చంద్రబాబు కాళ్లపైపడి గుడివాడ సీటుతీసుకున్న విషయాన్ని ఆ నియోజకవర్గ ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు. 2024 ఎన్నికల్లో గుడివాడ ప్రజలు నానీని కూనీ చేయడం ఖాయమన్నారు. 

ప్రజాస్వామ్యంలో నాయకులు ఎవరైనాసరే, ప్రజల తీర్పుని శిరసావహించాల్సిందేనని, గుడివాడవాసులు నానీని శాశ్వతంగా ఇంట్లో కూర్చొబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని బ్రహ్మం తెలిపారు. ఇప్పటికే నానీని గెలిపించినందుకు గుడివాడ ప్రజలు బాధపడుతున్నారని, ఇప్పటికైనా కొడాలి తనమనసు మార్చుకొని తనను ఎన్నుకున్న ప్రజలగురించి ఆలోచిస్తే మంచిదని టీడీపీనేత హితవుపలికారు.

నానీ తన పద్ధతి మార్చుకోకుండా ఇలానే మాట్లాడుతూఉంటే, భవిష్యత్ లో అతనికి దేహశుద్ధి తప్పదని బ్రహ్మం హెచ్చరించారు. చంద్రబాబుకి బడితపూజ చేస్తాననే ముందు, నానీ తనస్థాయి ఏమిటో, విలువేమిటో గ్రహిస్తే మంచిదన్నారు. ఖైనీలు నమిలి, నిషా ఎక్కి, నోటికొచ్చినట్లు నానీ మాట్లాడుతుంటే టీడీపీ వారెవరూ చూస్తూ ఊరుకోరన్నారు.

నానీ ఏమీ పైనుంచి ఊడిపడలేదని, అధికారమదంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతుంటే  చూస్తూ ఊరుకునేవారెవరూ లేరన్నారు. నానీ భాష, ప్రవర్తన మార్చుకుంటే అతనికే మంచిదని, లేకుంటే అతని రాజకీయ జీవితానికే ముప్పు అని బ్రహ్మం తేల్చిచెప్పారు.

నానీపై ప్రతితెలుగుదేశం కార్యకర్త తిరిగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. టీడీపీ కార్యకర్తల మౌనాన్ని చేతగానితనంగా భావించి, నానీ పదేపదే వారిని  రెచ్చగొడితే, అతని ఒళ్లుహూనమవ్వడం ఖాయమని నాదెండ్ల బ్రహ్మం తేల్చిచెప్పారు.