బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (07:13 IST)

25న 30 లక్షల మంది లబ్దిదారులకు ఇంటి స్థల పట్టాలు : మంత్రి కొడాలి నాని

పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.  గుడివాడ గుడ్ మెన్ పేట లో 3.5 కోట్లతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ కు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి మంత్రి  శంకుస్థాపన చేసారు. 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడ్ మెన్ పేట  ప్రాంతంలో ఉన్న ట్యాంక్  శిధిలావస్థలో ఉన్నందున స్థానిక ప్రజలు మంచినీటి కొరకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో 3.5 కోట్లలో అదే స్థలంలో నూతన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తున్నామన్నారు. అప్పటి వరకు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు నుండి ఈ ప్రాంత ప్రజలకు తాగునీని అందించాలని మున్సిపల్ కమీషనరుకు ఆదేశించారు.

ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత పథకం కింద  20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని పరిపాలన అనుమతులు లబించినందున  పనులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. గుడివాడ నియోజవర్గంలో అభివృద్ది సంక్షేమ పథకాలతో పాటు మౌలిస సదుపాయల కల్పనకు అడిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిధులు మంజురు చేస్తున్నారన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25 వ తేదీన 30 లక్షల మంది అర్హులైన  అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థల పట్టాలను అందజేయడం జరగుతుందన్నారు. ఇందులో భాగంగా గుడివాడ పట్టణంలో  8912 టిడ్కో గృహాలకు 3200 ఇల్లకు అసంపూర్తి గా పనులు మిగిలాయని, గత ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదని అన్నారు.  ఈ మొత్తం ఇల్లకు మరల టెండర్లు పిలచి పనులు ప్రారంబించామన్నారు.

అదేవిధంగా 81 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ల ప్రక్రిను ప్రారంభించామని మంత్రి కొడాలి నాని అన్నారు.  రానున్న మే మాసానికి 5 వేల ఇల్లను మరో నాలుగైదు మాసాల్లో 4 వేల ఇళ్ళను లబ్దిదారులకు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 300 చ.గ. ఇంటికి 500 రూపాయలతో పాటు 2లక్షల65 వేల లోన్  ఇచ్చారని, నేడు మా ప్రభుతత్వం  వారి నుండి ఒక్కరూపాయి తీసుకొని పూర్తిగా లోన్ రద్దుచేసిన ఇంటిని అందిస్తామన్నారు.

430 చ.గ.ఇంటికి లక్ష రూపాయలకు బదులు 50 వేలు,  360 చ.గ. 50 వేలకు బదులు 25 వేల రూపాయలు  కడితే సరిపోతుందని మిగిలిన సొమ్ము ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీని వల 4,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం పడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ పట్టణంలో 7700 మందికి ఇంటి స్థల పట్టాలను అందించేందుకు 94 కోట్ల రూపాయలతో 181 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. 

అర్హులైన అందిరికీ ఇంటి స్థల పట్టాలను అందిస్తామన్నారు. గుడివాడ పట్టణంలో టిడ్కో మరియు ఇంటి స్థల పట్టాల మొత్తం 15 వేలమంది లబ్దిదారుకు అందించడం జరుగుతుందన్నారు.  డిశంబరు 25 నుండి  ఇంటి స్థల పట్టాలను అందించి సెంటు స్థలంలో ప్రభుత్వమే 2 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించి లబ్దిదారునికి అందిస్తుందన్నారు.

మార్చి నెలాఖరు నాటికి 8900 ఇళ్ళను పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా 10 కోట్లతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అమృత పథకం క్రింద పేజ్ ఒన్, పేజ్ త్రీలలో చేపట్టిన పనులు జరుగుతున్నాయని ఇంటించికీ మంచినీటిని అందించే ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.  ఏ ముఖ్యమంత్రి చేయని  విదంగా   అమ్మఒడి, జగనన్నతోడు, ఆసరా, నాడు-నేడు, రైతుభరోసా, జగనన్న విద్యాదీవెన్, వసతిదీవెన వంటి పలు పథకాలను నేరుగా లబ్దిదాగారుల అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మనమందరం ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిజేద్దామన్నారు.