శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (08:11 IST)

28 లక్షల ల‌బ్ధిదారులకు రేష‌న్ పంపిణీ: మంత్రి కొడాలి నాని

‌రాష్ట్రంలో 1.52 కోట్లకు పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నాయని 15వ విడతలో ఇప్పటివరకు 28.01 లక్షలు ల‌బ్ధిదారుల‌కు ఉచితంగా 44.518 మెట్రిక్ టన్నుల బియ్యం 2.655 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఈ మేర‌కు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

పోర్టబులిటీలో భాగంగా అనంతపురం జిల్లాలో 69 వేల 298 రేషన్ కార్డుదారుల‌కు, చిత్తూరులో 45వేల 796 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక లక్ష 03 వేల 733 కార్డులకు, గుంటూరు జిల్లాలో ఒక లక్షా నలభై రెండు వేల 988 కార్డులకు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 57 వేల 397 రేషన్ కార్డులకు, కృష్ణాజిల్లాలో 89 వేల 186 కార్డులకు, కర్నూలు జిల్లాలో ఒక లక్ష02 వేల 680 కార్డులకు, 

నెల్లూరు జిల్లాలో 35 వేల 017 కార్డులకు, ప్రకాశం జిల్లాలో 59 వేల 028 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో 20వేల 171 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో 79వేల 307 కార్డులకు నిత్యావసర సరుకులను అందచేసమన్నారు.

అలాగే అనంతపురం జిల్లాలో12 లక్షల73 వేల 615 రేషన్ కార్డులు ఉండగా వీరిలో 2 లక్షల 35 వేల  457 రేషన్ కార్డులకు 4 వేల 091 మెట్రిక్ టన్నుల బియ్యం, 226 మెట్రిక్ టన్నుల కంది పప్పును ఉచితంగా సరఫరా చేయాసమన్నారు. సమావేశంలో తదితర జిల్లాకు పంపిన బియ్యం, కంది పప్పు వివరాలను తెలిపారు.