కరోనా భయంతో ఇంట్లోనే చంద్రబాబు : మంత్రి కొడాలి నాని

kodali nani
ఎం| Last Updated: శనివారం, 31 అక్టోబరు 2020 (06:05 IST)
టీడీపీ నేత లోకేష్‌పై మంత్రి కొడాలి నాని మళ్లీ నోరు పారేసుకున్నారు. లోకేష్‌‌కు వరి చేనుకి చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవాచేశారు. అమరావతిలో భూములకు రేటు పడిపోయిందని, రైతులను అడ్డుపెట్టుకుని గోతికాడ నక్కలా బతుకుతున్నారని ఆరోపించారు.

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగినందుకు బషీర్‌బాగ్‌లో.. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ కూడా వేసుకోవడం కాదని, బషీర్‌బాగ్‌ ఘటనలా మీరూ కాల్చుకుంటే బాగుంటుందన్నారు.

దేశంలో విపత్తులు వస్తే ప్రధానితో పాటు సీఎంలు ఏరియల్‌ సర్వే చేస్తారని, అయితే కరోనా భయంతో చంద్రబాబు ఇంట్లో కూర్చున్నాడని కొడాలి నాని విమర్శించారు.
దీనిపై మరింత చదవండి :