బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:22 IST)

ఏపీలో రేష‌న్ పంపిణీ సంపూర్ణం: మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో 13వ విడత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో ఒక కోటి 50 లక్షల 81 వేల 100 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో ఇప్పటి వరకు ఒక కోటి 19 లక్షల 12 వేల 631 రేషన్ కార్డులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కార్డుదారులకు ఒక లక్షా 99 వేల 187 మెట్రిక్ టన్నుల బియ్యం, 11 వేల 818 మెట్రిక్ టన్నుల కందిపప్పు సరఫరా చేశామని తెలిపారు.

పోర్టబులిటీ ద్వారా అనంతపురం జిల్లాలో 2 లక్షల 64 వేల 246 రేషన్ కార్డులకు, చిత్తూరు జిల్లాలో ఒక లక్షా 80 వేల 303 రేషన్ కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల 43 వేల 376 రేషన్ కార్డులకు, గుంటూరు జిల్లాలో 4 లక్షల 93 వేల 660 రేషన్ కార్డులకు, కడప జిల్లాలో ఒక లక్ష 89 వేల 778 రేషన్ కార్డులకు,  కృష్ణా జిల్లాలో 3 లక్షల 96వేల 342 రేషన్ కార్డులకు, కర్నూలు జిల్లాలో 3 లక్షల 70 వేల 967 రేషన్ కార్డులకు,

నెల్లూరు జిల్లాలో ఒక లక్షా 94 వేల 885 రేషన్ కార్డులకు, ప్రకాశం జిల్లాలో 2 లక్షల 09 వేల  342 రేషన్ కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో 3 వేల 087 రేషన్ కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో 3 లక్షల 90 వేల 306 రేషన్ కార్డులకు,

విజయనగరం జిల్లాలో 97 వేల 720 రేషన్ కార్డులకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల 45 వేల 515 రేషన్ కార్డులకు నిత్యావసర సరుకులను అందజేసినట్టు మంత్రి కొడాలి నాని వివరించారు.