శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:03 IST)

ఏపీలో 'డిజిటల్‌ సచివాలయాలు’

ఇప్పటికే సచివాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మార్చిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గ్రామాలకు డిజిటల్‌ విప్లవం తీసుకురాబోతోంది. ప్రస్తుతం మండలాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం  నిర్ణయించారు.

ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. సీఎంతో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు లేదా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడానికి ఈ టీవీలను ఉపయోగిస్తారు. అలాగే పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితాలను కూడా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా ప్రదర్శిస్తారు.

సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా విజయవాడ నుంచే లబ్ధిదారుల పేర్లు, సంఖ్య మార్చే అవకాశముంటుంది. ఏ పథకం.. ఏ నెలలో ఎప్పుడు అమలవుతుందనే వివరాలను కూడా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.