శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (23:11 IST)

అవన్నీ అసత్య ప్రచారాలు: మంత్రి ఆదిమూలపు సురేష్

జగనన్న విద్యా కానుక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పధకం కాదని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ అండ్ బి భవన సముదాయంలో విలేకరులతో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ,  పేదరికం విద్యకు అడ్డు కాకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వచ్చిన ఆలోచన ఇదన్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ పధకం వైపు చూస్తున్నాయన్నారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యా కానుక కిట్లు పంపిణీ చేపట్టామని, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎప్పుడు పాఠశాలలు ప్రారంభం అవుతాయో, జగనన్న విద్యా కానుకతో స్కూల్ కి వెళ్లాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు.  బిఆర్ అంబేద్కర్ భావాలతో జగనన్న విద్యా కానుక  కార్యక్రమం సిఎం జగన్ నిర్వహించారు.

కోవిడ్ నిబంధనలు దృష్టి లో పెట్టుకొని 50 కిట్లు మించకుండా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పంపిణీ ప్రక్రియ జరుగుతున్న దన్నారు. జగనన్న విద్యా కానుకతో రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొని వుంటే , ప్రజల హృదయాల్లో జగనన్న నిలిచిపోతారాన్న భావనను ప్రతిపక్ష పార్టీలు, తెలుగు తమ్ముళ్లు ఓర్చుకోలేకపోతున్నారు.

ఈ పధకం కేంద్ర ప్రభుత్వం పథకం అని అవాకులు చెవాకులు పేలుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఈ పథకం వుందా ?. అని మంత్రి ప్రశ్నించారు ఈ పథకానికి  వంద శాతం నిధులు మేమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి దన్నారు.
 
యూనిఫాంల కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేంద్రం నుండి వచ్చిందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రు.293 కోట్ల ను ఖర్చు చేసి 3 జతల యూనిఫార్మ్ లు ఇస్తున్నామని తెలిపారు. కుట్టు కూలి మొత్తాన్ని తల్లులు ఖాతాలో జమచేస్తున్నామన్నారు. కేంద్రం నుండి నిధులు వస్తే మేం బహిరంగంగా చెబుతామన్నారు. రూ.650 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులు లకు కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రజలు సంతోషంగా వుంటే ప్రతిపక్షం సంతోషంగా వుండదన్నారు. స్కూల్ బ్యాగ్స్ కోసం రు.69.44 కోట్లు, నోట్ బుక్స్ కోసం రు.79.05 కోట్లు, షూస్, రెండు జతల సాక్స్ కోసం రు.67.75 కోట్లు, బెల్ట్ ల కోసం రూ.10.13 కోట్లు, వర్క్స్ బుక్స్ కోసం రు.29.70 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా జగనన్న విద్యా కిట్లు అందక పోతే సమాచారం ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
 
నాణ్యత తో కూడుకున్న నోట్ బుక్స్ , జగనన్న విద్యా కానుక కిట్ లను ఇచ్చామన్నారు. మీరు చేసే ఆరోపణ లపై చర్చకు సిద్దం అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ ను, బడి బయట  పిల్లల సంఖ్యను తగ్గించాలని సిఎం దార్శనికతో తాము , అధికారులు పని చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడంటే... చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు. కేంద్రం   నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా  జగనన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని తెలిపారు.