సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (07:39 IST)

గత ఐదేళ్లలో కడప జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మంత్రి ఆదిమూలపు సురేశ్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇటీవలే కడప జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా స్థితిగతులపై స్పందించారు. గత ఐదేళ్లలో కడప జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.

రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టడం దారుణమని, సాగునీటి ప్రాజెక్టుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు.


కడప స్టీల్ ప్లాంట్, రాజోలి ఆనకట్ట నిర్మాణానికి డిసెంబరులో సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు.

రిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళతామని స్పష్టం చేశారు.